అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

23, జనవరి 2010, శనివారం

తొలి పలుకుల మీద కొన్ని 'తొలి పలుకులు '

 నేను చిన్న చిన్న పద్యాలు రాస్తున్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం కొరకు మనసు తపించిపోతూ ఉండేది. ప్రయోగం అంటే పాత కాలం వారి లాగా కొన్ని సూత్రాలకు అనుగుణంగా రాయాలని కాదు. శ్రీ శ్రీ గారి లాంటి వారిని స్పూర్తిగా తీసుకుంటూ సరళంగానూ , నా మనసు కోరుకునే విధంగా ప్రయోగాలు చేస్తూనూ రాయాలనుకున్నాను. అందుకు ఆలోచించగా నాకు వచ్చిన ఒక మంచి ఆలోచనే 'తొలి పలుకులు' . ఈ రకపు ప్రయోగము ముందరే ఉన్నదో లేదో నాకు తెలియదు కాని ఈ రకపు పద్యాలకు నేను పెట్టుకున్న పేరు 'తొలి పలుకులు'. అలా చాలానే రాసాను. కాని చాలా మంది లాగానే నేను వాటిని భద్రపరచుకోలేదు. మిగిలిన కొన్నింటిని నేను ఈ బ్లాగులో పాటకుల(?)తో పంచుకుందామనుకున్నా .


ఈ 'తొలి పలుకులు' అన్నింటికీ నిభందన ఒక్కటే. చిన్న నిభందన కానీ చాలా కష్టమైనదే. నిభందన ఏమిటంటే పద్యము లోని ప్రతి పదములోని మొదటి అక్షరములన్నీ ఒక్కటే అయి ఉండాలి. పదములు స్వతంత్రముగా వాడలేము కనుక పద్యాలలో కొన్ని అచ్చ తెలుగు పదాలు ఉంటె కొన్ని అరువు తెచ్చుకున్నవి కూడా ఉండవచ్చు. పంక్తుల సంఖ్య పైన కాని , ప్రాస విషయంలో కాని ఎటువంటి నిభందనలు లేవు. భావము సాధ్యమైనంత సులభంగా అర్ధం కావాలి. భావ సరళత నిభందన కాదు కాని నాకు సంబంధించిన అంత వరకు భావనలు సులభంగా అర్ధమయ్యేలాగా ఉంటేనే ఇష్టపడతా. అందుకే కొంత వరకు కష్టమయిన పదాలు వాడినా చేతనైనంత వరకు సులభమైన పద్యాల కొరకే ప్రయత్నించా.


'తొలి పలుకుల' గురించి మీకు ఇంకా తెల్సి పోయింది కదా! ఇంక ఈ 'తొలి పలుకుల' తుంపెరలో తడసిపోండి :)


సమాప్తం 

2 వ్యాఖ్యలు:

  1. బ్లాగ్ టైటిల్ కొంచెం మారిస్తే బాగుంటుందేమోనని పిస్తోంది
    దయచేసి అన్యధా భావించవద్దు.
    ఇది నా అభిప్రాయం మాత్రమే.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మీకు బ్లాగు టైటిల్ నచ్చక పోవడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అండీ? కొంత వెరైటీగా ఉండాలని అలా పెట్టాను

    ప్రత్యుత్తరంతొలగించు