అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

4, మార్చి 2012, ఆదివారం

గుర్తుకొస్తున్నాయి - 1

1.తొలి ప్రేమ  (అలేఖ్య)
మొదటి అంకం

ఇప్పుడు సమయం రాత్రి 2 గంటలు. ఇంకా కళ్ళు మూతపడట్లేవు. మనసు నిండా వేల కొద్దీ ఆలోచనలు . ఒక్కటి కూడా స్పష్టంగా లేదు.  నింపాదిగా సాగిపోతున్న నా జీవిత నావ ప్రయాణాన్ని ఒక చిన్నపాటి సుడిగుండం అడ్డుకుంటుంది. ఇది చిన్నదే అని తెలసు. ఇది వీగిపోతుందని కూడా తెలసు. కానీ అది ఉన్నంత సేపు ఇక్కడ అలజడి రేగుతూనే ఉంది.
ఎక్కడో ఇండియా లో ఒక మారుమూల పల్లెటూరిలో పుట్టిన నేనిప్పుడు, ఒకప్పుడు మన దేశాన్ని బానిసగా చేసుకున్న ఈ ఇంగ్లీషు దేశపు ఆర్ధిక స్థితిని నా కను సైగలతో శాసించగలను. ప్రపంచంలోని బిల్లియనియర్ల జాబితాలో నా పేరు తప్పని సరి. ఈ ఇంగ్లీషు వారి ప్రభుత్వము నిలపెట్టాలన్నా , కూలదోయాలన్నా నా సాయం ఉండాల్సిందే. ఇంత పవర్ , డబ్బు ఉన్నా కానీ ఎక్కడో ఏదో వెలితి. రోజంతా బిజీగా ఉన్నా రాత్రి ఇంటికి చేరేసరికి ఆ లోటు గుండెలపై తన్నుతుంది.


నాకిప్పుడు 36 ఏళ్ళు. ప్రపంచంలో మూడవ పెద్ద ధనవంతున్ని. కానీ నాకింకా పెళ్లి కాలేదు. వినడానికి నమ్మ శక్యంగా ఉండక పోవచ్చు కానీ ఇది నిజం. అదే నా బాధ. ఇంటికి రాగానే నా ఒంటరితనం నాకు తెలిసివస్తుంది. మనిషికి డబ్బు ముఖ్యం. కానీ ఆ డబ్బుని అనుభవించడానికి, పంచుకోవడానికి ఒక తోడు కావాలి.


నా జీవితంలో ఎందరో అమ్మాయిలు నాకు ఎదురయ్యారు. కొందరితో జీవితాంతం ఉండాలనిపించేది. కొందరు నేనంటే ప్రానాలిస్తామనే వారు. కానీ ఏ ఒక్కరినీ నా జీవిత భాగస్వామి చేసుకోలేకపోయా.


ప్రేమ - అదంటే ఏమిటో తెలియని వయసది . సినిమాలలో చూపేదాన్నే ప్రేమ అంటారు అని అనుకొనే వాణ్ణి. హీరో హీరోయిన్ ని చూడగానే ఒక్క సారిగా ప్రపంచం ఆగి పోతుంది. అక్కడే తను fix అయిపోతాడు. ఈ అమ్మాయే నా జీవితంలో మొదటి మరియు చివరి హీరోయిన్ అని. ఆమె కోసం పడరాని పాట్లు పడతాడు. ఆ అమ్మాయి ఒక నగను చూసి ఇష్టపడిందని ఆమెకు అది ఇవ్వడానికి రాత్రంతా rickshaw తొక్కుతాడు. ప్రేమంటే అంతే. అమ్మాయిని చూడగానే మోహించడం , ఆమెనే జీవితం అనుకోవడం, అందుకొరకు దేనినైనా వదులుకోవడం.


అంత వరకూ residential స్కూల్ లో అమ్మాయంటే తెలియకుండా పెరిగిన వాణ్ణి, ఒక్క సారిగా కో-ఎడ్ కాలేజిలో వచ్చేసరికి మది చెదిరిపోయింది. అంత వరకు నేను చూసిన ప్రతి సినిమాలో హీరోకి లవ్ స్టొరీ తప్పకుండా ఉంటుంది. మరి నాకు ఎందుకు ఉండకూడదు? అనుకున్నా . లెక్కల్లో బాగా ఆరితేరిన నేను ఒక చిన్న లెక్క వేసా -

ఇక్కడ 120 మంది అబ్బాయిలున్నారు. 72 మంది అమ్మాయిలున్నారు . అందులో ఒక 20 % మంది చూడడానికి బాగుంటారు. అంటే 14 మంది. ఆ 14 మందిలో ఒక నలుగురికి already ఎవడో ఒకడు తగిలుంటాడు. మిగిలిన పది మంది కొరకు ఇక్కడ 120 మంది వెంట పడుతారు. Competition చాలా ఎక్కువగానే ఉంది. అందుకే నాకు కనిపించిన మొదటి తెల్ల పిల్లని ప్రేమించేద్దాం అని అనుకున్నా.


ఇంతలో వెనక నుంచి ఒక గొంతు 'అలేఖ్య' అంటూ పిలిచింది . ఎవరిదీ అందమైన గొంతు అని వెనక్కి తిరిగి చూసా. మా లెక్కల మాష్టారు . ఆయనది ఒక విచిత్రమైన గొంతు . గొంతు మాత్రమే వింటే ఏ అబ్బాయైనా ఆయనకు పడి పోవాల్సిందే. చా నా జీవితం అని అనుకునేలోపే 'Yes Sir ' అంటూ ఒక తెల్ల పిల్ల పలికింది. అంతే 'Main Hoon Na ' సినిమా గుర్తొచ్చింది. నేను dreamsloki వెళ్ళిపోయా. నాకు తెల్సిన ప్రతి సినిమాలో హీరో హీరోయిన్లను  గుర్తు తెచ్చుకొని వాళ్ళ బదులు మా ముఖాలు morph చేసేస్కున్నా. ఇంతలో ఎవరో బలంగా చేయి పట్టుకొని కదిలించారు. స్పృహలోకొచ్చి చూస్తే ఎదురుగా అలేఖ్య.


ఏదో ఇంగ్లీషులో మాట్లాడుతుంది.  ఆమె బాధ నాకర్ధమైంది - లెక్కల మాష్టారు ఆమెకి ఏమైనా doubts ఉంటె నన్ను అడుగమని చెప్పాడంట . అది కాలేజిలో మూడో రోజే . కానీ అప్పటికే టీచర్లకు నేను తెలివైన స్టూడెంట్ అని చాటింపు అయిపోయింది. అందుకే మాష్టారు ఏమైనా doubts ఉంటె నన్ను అడుగమని ఈమెకి చెప్పాడంట. ఆహా!! మా లెక్కల మాష్టారు నా జీవితానికి ప్రేమ దేవుడిలా తగిలాడే అనుకున్నా. కానీ నా బాధంతా ఏంటంటే ఆమె ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది.


నేను చిన్నప్పటి నుంచి ఊరు వాతావరణంలో పెరిగా. అక్కడ ఇంగ్లీషులో రాయడమే కానీ మాట్లాడింది ఒక్క సారి కూడా లేదు.  అదీ కాక జీవితంలో అమ్మాయితో మాట్లాడడం అదే మొదటి సారికే. అందుకే ఆమె ఇంగ్లీషు నాకు అర్ధం అవుతుంది కానీ నా భాషే ఆమెకు అర్ధం కావట్లేదు.


"Hi , I am Alekhya "
"Hi , I మోతుకూరి వీర వెంకట ఆనంద ప్రసాద్ , Friends me Anand"
"Oh! Santosh sir said me that you are very good at Maths. I have a doubt and sir had to leave early. So, he told me to get it clarified by you"
"You no Telugu?"
"Actually, I am a Marathi. I don't know Telugu"


అలా అనేసి వెళ్ళిపోయింది.  నాకు ఏం మాట్లాడానో తెలీదు కానీ, ఆ పిల్లకి మాత్రం వెంటనే తన Doubt clear అయిపోయింది . నాకు తొలి చూపులోనే ఆ అమ్మాయి పైన ప్రేమ పుట్టేసింది.