అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

23, జనవరి 2010, శనివారం

తొలి పలుకులు-2 | వాత్సాయన వరులు


వాత్సాయన వరులు



వెన్నెల వెలుగులలో వన్నెలు వొలుకబోస్తూ
వేళకానివేళ  వొంటరి వారిని వేడెక్కించి
వలపుల వూయలలో వారిని వూపివేసి
వానజడిలోనైనా వంటిని వెచ్చంగానే వుంచే
వయారి వనితలు వేలమంది వుండరేల?
వారిని వరించు వరులు వాత్సాయనులేనా ?


- Luckyమురారి

ఈ 'తొలి పలుకు'ని బ్లాగు కొరకు రాస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చివరి పంక్తి లో, అలా కాకుండా
వారిని వరించు వరులు  వేలల్లో వొక్కరేనా ?
అని రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక 'funny ' ఆలోచన వచ్చింది . వారు వేళల్లో ఒక్కరిని కాకుండా ఒక్కొక్కరు వేల మందిని చేసుకుంటారా ఏమి నా పిచ్చిగాని  అని అనిపించింది :) ఏమైనా వాత్సాయనుడు నిజంగా అదృష్టవంతుడేనని ఒప్పోకోవాలండీ .


సమాప్తం 

2 కామెంట్‌లు:

  1. "వేల కాని వేల వొంటరి వారిని వేడెక్కించి"
    అంటే
    "వేళ" కాని "వేళ" వొంటరి వారిని వేడెక్కించి
    అని అర్ధం కదా
    మీ మొదటి పోస్ట్ లో వ్యాఖ్య వ్రాసాను గమనిచగలరు

    రిప్లయితొలగించండి
  2. నేను ఆ 'ళ' గురించి గమనించలేదండి . ఇప్పుడే సరి చేస్తాను . తప్పులని చూపించినందుకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి