అవీ ఇవీ మాత్రమే కాదు . అప్పడాలు , వడియాలు , చెగోడీలు, గారెలు, బూరెలు అన్నీ మీకు చవులూరించుటకు సిద్దంగా ఉన్నాయిక్కడ

5, సెప్టెంబర్ 2009, శనివారం

తొలకరిలో తొలి పలుకులు

ఎంతో కాలంగా బ్లాగు ప్రపంచం ( బ్లాగోళం ) లో ’Active' గా ఉన్నా కాని ఇంత వరకు మాతృభాషలో రాయడం కుదరలేదు. అలాగని నాకు తెలుగు భాషా పరిజ్నానం ( 'parignaanam' టైపు చేయడమెలాగో ఎవరైనా తెలుపగలరు ) లేదనుకోవద్దు. నాకు జ్నానం , భాషా పరిజ్నానం రెండూ ఉన్నాయండోయ్ . చిన్నప్పటి నుంచి   కవితలు, కావ్యాలు, పురాణాలు, కథలు చదివి వంట  పట్టించుకున్న తెలుగుని తెగులు పట్టించకూడదని 10వ తరగతి నుండి రాతలు, కూతలు, కోతలు రాయడం మొదలు పెట్టాను. సరే వాటినన్నింటిని ప్రచురిద్దామని ఈ బ్లాగు మొదలు పెట్టా. ఇది కనీసం ఆరు నెలల కిందటి మాట. ఆంధ్రులు ఆరంభ శూరులు అని నిరూపించుటకు కంకణం కట్టుకున్నట్లు ఇంత వరకు మొదటి టపా వ్రాయడం కుదరలేదు. ఇక పైన అయినా కాస్త నిలకడ ప్రదర్శిస్తానని ఆశిస్తూ గణపయ్యకు పూజతో మొదలుపెడుతున్నా

శుక్లాం భరదరాం విష్ణుం శశి వర్ణం ఛతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజాణన పద్మార్కం గజాణనమ్ అహార్నిషం
అనేకదం తమ్ భక్తానామ్ ఏకదంతం ఉపాస్మహే

2 వ్యాఖ్యలు:

 1. http://www.google.com/transliterate/
  దీనిని ఉపయోగించండి
  చాలా సులువుగా ఉంటుంది
  లేకపోతె బ్లాగర్ డ్రాఫ్ట్ లో వ్రాసుకోవచ్చు
  pari gnanam అని టైపు చేస్తే పదాలు కరెక్టుగా వస్తాయి
  మనం వ్రాసేటప్పుడు ఒక పదాన్ని వ్రాసి back space కొడితే నాలుగైదు పదాలు చూపిస్తుంది
  అందులో మనకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి
  ఉదాహరణకు jnanam అని కొట్టామనుకోండి,
  జ్ఞానం
  జననం
  జ్నానం
  జనానం
  జ్ఞనం
  అని చూపిస్తుంది అందులో మనకు సరిపోయే పదాలని ఎంచుకోవాలండి
  ఏదో నాకు తెలిసినవి చెప్పానండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ సలహాలు బాగా ఉపయోగ పడుతాయండి. ఇప్పుడు ఇక్కడ కామెంట్స్ రాయడానికి గూగుల్ లంకెనే వాడుతున్నానండి. సలహాలకు కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు